Site icon PRASHNA AYUDHAM

అప్రమత్తంగా ఉండండి: జిల్లా కలెక్టర్ల సమావేశంలో సిఎస్ శాంతి కుమారి

WhatsApp Image 2024 07 20 at 4.20.11 PM

ప్రశ్న ఆయుధం 20జులై
హైదరాబాద్:
ఉత్తర తెలంగాణాలోని 11 జిల్లాలలో ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.
ఇవ్వాళ, రేపు11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ను ప్రకటిం చిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమా వేశం నిర్వహించారు ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ…. పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఇవ్వాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు..
ఈ సందర్భంగా ఈ జిల్లా లకు చెందిన కలెక్టర్లు ఏవిధ మైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పా టు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజ లు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ 11 జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారుల తో సమన్వయ సమావేశా లు నిర్వహించాలని తెలియచేశారు..

Exit mobile version