Headlines :
-
అరసవల్లి సూర్యదేవాలయంలో హంసనావికోత్సవం – ప్రత్యేకతలు, తేదీలు
-
తెప్ప ఊరేగింపు – అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి హంసనావికోత్సవం విశేషాలు
-
క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా అరసవల్లిలో తెప్పోత్సవం – భక్తులకు పండుగ వాతావరణం
-
ఇంద్రపుష్కరిణిలో శ్రీ స్వామి వారి హంసవాహనం పై భక్తులకు ప్రత్యేక దర్శనం
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి నందు వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హంసనావికోత్సవము తెప్పోత్సవం సందర్భముగా ఈ నెల 13వ తేది (క్షీరాబ్ధి ద్వాదశి) బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అత్యంత వైభవముగా జరపబడును. సదరు తెప్పోత్సవం సందర్భముగా ఎదురుగా గల ఇంద్రపుష్కరిణి (కోనేరు)లో శ్రీ స్వామి వారిని దేవేరులతో సహా హంసవాహనం పై ఊరేగింపు కార్యక్రమం జరుగనుందని అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి యర్రంశెట్టి భద్రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.