*ఆదివాసీ హక్కుల కోసం ఆత్మగౌరవ పోరాటం
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిది 23-04-2025(ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరరావు
ఆదివాసి ఆత్మగౌరవ సభ & ర్యాలీ కరపత్రాలు విడుదల….
మే నెల 7వ తేదీన జరగబోయే ఆత్మగౌరవ సభ ర్యాలీ కరపత్రాలను విడుదల చేస్తూ రాష్ట్రంలో ఆదివాసులకి జరుగుతున్న అన్యాయంపై ప్రజలు మరియు ప్రజా సంఘాలు ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు సభ నిర్వహి స్తున్నామని సంఘం ప్రతినిధులు తెలియజేయడం జరిగింది.
ఎన్నో సంవత్సరాలగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనే సంతోషం కనీసం ఏ ఒక్క ఆదివాసుల్లో కూడా లేకపోవడం చాలా బాధాకరం ప్రభుత్వం వెంటనే దిని పై స్పందించాలని కోరుచున్నాం.
డిమాండ్స్
@ ఆదివాసులు ప్రత్యేక ఉద్యోగ చట్టం చేయటం.
@1/70 చట్టం పరిరక్షించడం .
@ఏజెన్సీలో ఉన్న ప్రతి ఆదివాసికి టిడ్కో తరహాలోని ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వడం.
@ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నియమించాలి.
@ప్రతి ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని నియమించాలి.
అనే డిమాండ్స్ తో బహిరంగ సభ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు & ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ రోబ్బా లోవరాజు,జేఏసీ వైస్ చైర్మన్ దుక్క సీతారాం, ఇంటికుప్పల రామకృష్ణారావు,లక్ష్మయ్య,సూర్యం,కొండలరావు, గిరిజన నాయకులు అందరూ పాల్గొన్నారు