సంగారెడ్డి/పటాన్ చెరు, సెప్టెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు డివిజన్ పరిధిలో నిత్యం శ్రమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు, అలాగే భక్తుడికి దేవుడికి మధ్య వారధిగా నిలుస్తూ నిరంతరం సేవలందిస్తున్న పూజారులకు దసరా పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి ప్రిథ్వీరాజ్ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ “గర్భిణీ స్త్రీల పౌష్టికాహార లోపం లేకుండా ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను ఆశా వర్కర్లు నిత్యం చేరవేస్తున్నారని అన్నారు. అదే విధంగా పూజారులు తమ కుటుంబంతో కలసి దేవుడి సేవలో జీవితాన్ని అంకితం చేస్తున్నారని తెలిపారు. వీరందరికీ దసరా పండుగ సందర్భంగా కొత్త దుస్తులు అందజేయడం ఆనందంగా ఉందని ప్రిథ్వీరాజ్ పేర్కొన్నారు.