ప్రజా (కాంగ్రెస్) ప్రభుత్వాన్ని కూలుస్తామన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 15: కూకట్‌పల్లి ప్రతినిధి
కూలదొయడానికి ఆర్థిక వనరులు ఇస్తామన్న వారిపై సైతం చర్యలు తీసుకోవాలి
రాజ్యాంగాన్ని అవమానించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి అనర్హుడు
*కేసు నమోదు చేయాలని కోరుతూ కూకట్పల్లి ఏసిపికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు*
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కూకట్ పల్లి ఏసిపికి ఫిర్యాదు చేసిన వారిలో ఏ బ్లాక్ అధ్యక్షుడు ఈ నాగిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాదు ప్రతాపరెడ్డి . కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు పాల్పడినందుకు డుబ్బాక ఎమ్మెల్యే కోఠ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణలో ప్రజలచే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదోసేలా కుట్రపూరితమైన ప్రకటనలు చేసిన డుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అభ్యర్థించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం జరిగిన నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పలువురు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ డీలర్లు తనను సంప్రదించి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు” అని చెప్పారు. ఈ చర్య ద్వారా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఉన్నదని పేర్కొన్నారు. తాము భావిస్తున్న దాని ప్రకారం ఈ ప్రకటనలు ఒక సీనియర్ ప్రజా ప్రతినిధి చేయడం ప్రజాస్వామ్యానికి శత్రుత్వంగా భావించాలి. ఇలాంటి ప్రకటనలు అవినీతిపరమైన నల్లధనం మాఫియా, మనీ లాండరింగ్ మాఫియా వలయాల ప్రమేయాన్ని సూచిస్తున్నాయని, ఇది రాష్ట్రంలో చట్టబద్ధమైన పరిపాలనకు ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో పాటు ఆయన్ను కలిసిన పేరులేని వ్యాపారులు, రియల్టర్లు మీద కూడా కేసులు నమోదు చేయాలని, నల్లధనం మాఫియా, మనీ లాండరింగ్ ద్వారా ప్రోత్సహించబడుతున్న ఈ కుట్రపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై త్వరలోనే స్పీకర్, గవర్నర్ లకు ఫిర్యాదు చేస్తామని శేరి సతీష్ రెడ్డి తెలిపారు. పాల్గొన్నవారు మేకల మైకల్, కొండల్ రెడ్డి, విట్టల్ రెడ్డి, సాయి రెడ్డి, దేవ సహాయం, అక్బరుద్దీన్, రాజు ముదిరాజ్, కొమ్ము బాబు, గిరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.