కామారెడ్డి మండల విద్యాశాఖలో వింత ఆచారం…?

కామారెడ్డి మండల విద్యాశాఖలో వింత ఆచారం..?

IMG 20250127 WA0010

మేలా, ప్రధానోపాధ్యాయులు సమావేశం పేరుతో పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కామారెడ్డి మండల ఉపాధ్యాయ లోకం..!

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఉపాధ్యాయుని పదవి విరమణ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనడం ఎంతవరకు సమంజసం అని పలువురు విమర్శిస్తున్నారు. పాఠశాలలు కొనసాగే సమయంలో పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి ఉపాధ్యాయులు అధిక మొత్తం హాజీర్ కావడం బహుశా ఇది కామారెడ్డి మండలంలోనే జరుగుతుందనీ పలువురు విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇది మండల విద్యాశాఖ అధికారి కను సన్నల్లోనే జరుగుతుందా, మమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరని ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా ? నీతులు చెప్పే వారే ఇలా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే వారికి వంత పాడడం ఎంతవరకు సరియైనదో ఉపాధ్యాయులే ఆలోచించుకోవలని పలువురు పేర్కొంటున్నారు.

పదవి విరమణ కార్యక్రమాలు నిర్వహించుకోవడం తప్పుకాదు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలి, కానీ అది సెలవు రోజు నిర్వహించుకుంటే బాగుంటుంది లేదా మూడు గంటల తర్వాత నిర్వహించుకుంటే బాగుంటుందేమో అని ఒక సగటు ఉపాధ్యాయుడి చిన్న సందేహం అని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Join WhatsApp

Join Now