Site icon PRASHNA AYUDHAM

చినుకు పడితే చిత్తడే…

If it rains it will rain

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 20

ఓసి-2 లో నూతనంగా నిర్మించిన సైట్ ఆఫీస్ ఎస్ అండ్ డి సెక్షన్ కు వెళ్లాలంటే వర్కర్లకు నరకయాతనే…

సమస్యలపై స్పందించని అధికారుల తీరుపై కార్మికుల ఆగ్రహం

మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ ఓసి2 లో నూతనంగా నిర్మించిన సైట్ ఆఫీస్ వద్దకు వెళ్లాలంటే సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కొండాపురం సిఎస్ పి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల కార్మికుల ద్విచక్ర వాహనాలు జారి పడే దెబ్బలు తాకిన దాఖలాలు ఎక్కువనే ఉన్నాయనీ, వరద వస్తే రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్నారు, ఇది ఇలా ఉండగా ఎస్ అండి సెక్షన్లో కార్మికులు ఇన్ అవుట్ పడి విధుల రాకపోకలకు కార్మికులు నరకయాతన పడుతున్నారు, దానికి తోడు సులభ్ కాంప్లెక్స్ వెళ్లడానికి దారి లేదు, వాటిని శుభ్రం చేయడానికి కూడా స్రావెంజర్లు లేక దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు,ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా గాని పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు, త్రాగునీరుకు ఓఆర్ ప్లాంటు ఏర్పాటు లేదని కూడా చెబుతున్నారు,ఇప్పటికైనా ఓసి టు అధికారులు స్పందించి నూతన సైట్ ఆఫీసు వద్ద కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను వేడుకుంటున్నారు

Exit mobile version