మాలలు సింహ గర్జన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పోస్టర్

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాదులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా డిసెంబర్ 1న జరగబోయే మాలలు సింహ గర్జన వాల్ పోస్టర్ ను సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మాల ఆత్మ గౌరవాన్ని ఈ సమాజానికి చాటి చెప్పలని, మాలల సింహగర్జనను అన్ని జిల్లాల నుండి మాలలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్, సంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడు బైండ్ల అశోక్ కుమార్, జిల్లా నాయకులు పంబాల దుర్గాప్రసాద్, మన్నె సాగర్, సురేష్, ప్రమోద్, పురుషోత్తం, ఉదయ్, వెంకటేష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment