నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి.
– పెండింగ్ లో ఉన్న కేసుల గురించి డిఎస్‌పి, సిఐలను, ఎస్ఐలను అడిగి కేసు ఫైల్స్ ను పరిశీలించరూ
– సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలి
– సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి.
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

జిల్లా ఎస్పీ జిల్లా కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో అధికారులతో సమీక్ష నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కేసుల గురించి డిఎస్‌పి, సిఐలను, ఎస్ఐలను అడిగి కేసు ఫైల్స్ ను పరిశీలించరూ. సమగ్ర విచారణతో నేరస్తులకు న్యాయస్థానం ద్వార శిక్ష పడే విధంగా పోలీస్ అధికారులు బాధ్యతగా కృషి చేయాలనీ, పోలీస్ స్టేషనులకు వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు కట్టుబడి పని చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివరణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలనీ, విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దనీ నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. పెండింగ్ (అండర్ ఇన్వెస్టిగేషన్) లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమితకి లోబడి వుండాలని, గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎస్ ఓ పి తప్పకుండా పాటించాలి అనే విషయాలపై తగు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ తో త్వరితగతిన పూర్తి చేసి భాదితులకు అండగా నిలవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ పోర్న్ ఏరియాగా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. నేర నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను చేదించడంలో ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్చంధంగా వారి గ్రామలలో, ప్రధాన కూడళ్లలో, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల ఆన్లైన్, మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి ఐపిఎస్, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జార్జ్, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 33