*పెద్దపల్లి జిల్లాలో మండుతున్న ఎండలు*
పెద్దపల్లి జిల్లా ఏప్రిల్23
తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది, రాగల నాలుగు రోజులపాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది..
బుధవారం ఉమ్మడి జిల్లా కరీంనగర్ పరిధిలోని పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
విపరీతమైన ఉక్కపోతతో పాటు వాడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనం ఇళ్ల నుండి బయటికి రావాలంటే జంకుతున్నారు.
ఉదయం 11గంటల నుండి సాయంత్రం వరకు జనం ఇండ్ల నుండి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం రహదారులన్నీ జనంలేక బోసిపోయాయి.
శీతల పానీయాల దుకాణాలతో పాటు కొబ్బరి బొండాల బండ్ల వద్ద కిక్కిరిసిన వాతావరణం కనబడుతుంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల గిరాకీ అమాం తంగా పెరిగిపోయినట్లు వ్యాపారులు పేర్కొంటు న్నారు.