ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
ప్రశ్న ఆయుధం న్యూస్, ఫిబ్రవరి 05, కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జన్మదినం సందర్భంగా కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కామారెడ్డిని గత పదేండ్లలో గంప గోవర్ధన్ చేసిన అభివృద్ధిని గుర్తుచేశారు. ప్రజలకు ఎల్లపుడు అండగా ఉండే గంప గోవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు పరుశురాం గౌడ్, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, శ్రీను, ఆనంద్, సాయిచరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.