బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు
ప్రశ్న ఆయుధం న్యూస్ జూలై 20
అల్లూరి సీతారామరాజు జిల్లా
పెద్ద లోచలి పంచాయతీ, గొడుగు మామిడి గ్రామం లో పాంగి సత్య నారాయణ s/o లక్ష్మ చారి (33) అనే గిరిజనుడి ఇళ్ళు తుపాను దాటికి శనివారం నాడు మధ్యాహ్నం నేల కూలిపోయిందని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు ఒక ప్రకటన లో తెలిపారు , అదే సమయంలో అక్కడే ఉన్న పాంగి లక్ష్మీ ప్రసన్న D/o వెంకటరమణ (20) యువతికి తీవ్ర గాయాలు అయ్యిందని బాధితులు తమ దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు,కావున జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు నష్ట పరిహారం లేదా ప్రధాన మంత్రి అవాస్ యోజన పధకం ధ్వారా పక్క ఇళ్ళు మంజూరు చెయ్యాలని కోరారు, అలాగే గాయల పాలైన గిరిజన యువతికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.అలాగే తుపాను వల్ల గిరిజన గ్రామాల్లో వాగులు, గడ్డలు పొంగి ప్రవహిస్తునందున ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అయన విజ్ఞప్తి చేసారు.