బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ ప్రజలతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర నిర్మాణ శిల్పి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్, అసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ప్రజల సంక్షేమం సాధ్యమైందని గుర్తు చేశారు. ఈ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలంటే మాగంటి సునీతను గెలిపించడం ద్వారా జూబ్లీహిల్స్ అభివృద్ధికి బలమైన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అల్లాపూర్ కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్, పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి, జిన్నారం వెంకటేష్ గౌడ్, సందీప్ గోస్వామి, మహేష్, సన్నీ, సతీష్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment