*భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా రాజీవ్ ఘాయ్*
ఆపరేషన్ సిందూర్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కు మంచి పేరు వచ్చింది. కేంద్రం సైతం ఆయన పై ప్రశంసలు కురిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా నియమించింది. భారత సైన్యం లోని ముఖ్యమైన పోస్టులలో ఇది ఒకటి. ఇక నుంచి ఆయన భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం కోసం పనిచేయనున్నారు.అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)గా కూడా పనిచేస్తారు.