*భారీ వర్షాల పట్ల ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి*
*కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్*
*జమ్మికుంట జూలై 23 ప్రశ్న ఆయుధం*
మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని,దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ వొడితల ప్రణవ్ అధికారులను కోరారు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకోవాలని,వర్షాకాలం వలన విష జ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున,ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు బుధవారం రోజున 5 మండలాల ఎంపీడీవోలు,2 పట్టణాల కమిషనర్ లతో మాట్లాడి తగిన సూచనలు చేశారు.రైతులు వ్యవసాయానికి వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని,కరెంట్ స్తంభాలు ఇతరత్ర సరి చూసుకోవాలనీ కోరారు.