మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ 

మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా పదవతరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు అధికారులతో మాట్లాడుతూ, పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రం లోనికి పంపించాలని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా పరిశీలించాలని తెలిపారు. కేంద్రంలో త్రాగునీరు, టాయిలెట్స్, మెడికల్ సదుపాయాలు, రవాణా వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ వెంకటరమణ, డిపార్టుమెంటు అధికారిని మేరీ వర్ధనం, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now