*వేములవాడ ఆలయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి*
మేడ్చల్ మల్కాజ్గిరి:మే 16
శ్రీ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్యమత కట్టడాల విషయమై హిందూ భక్తుల మనోభావాలు కలచివేస్తున్నాయని, ఆయా కట్టడాలను తొలగించి సంబంధిత వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని దేవదాయ శాఖను కోరుతూ రవీందర్ గౌడ్ నూనెముంతల చత్రపతి శివాజీ మహారాజ్ మండల్ వ్యవస్థాపక అధ్యక్షుడు—ఒక వినతి లేఖను ప్రభుత్వానికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వేములవాడ ఆలయం దక్షిణ కాశీగా పిలువబడే పవిత్ర స్థలం. లక్షలాది హిందువుల ఆస్తికతకు ప్రతీకగా నిలిచే ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. అయితే, ఆలయ పరిధిలో మాంసాహార రవాణా, ఇతర మతపరమైన కార్యకలాపాలు జరుగుతుండడం భక్తుల మనోభావాలకు బాధ కలిగిస్తోంది. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీయకూడదు,” అని తెలిపారు.
అన్యమత నిర్మాణాలను శాంతియుతంగా తొలగించి, వారికి వేరే తగిన స్థలం కేటాయించడమే సమన్యాయం అని ఆయన పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో తీసుకున్న మార్గదర్శకాలను అనుసరించడం వల్ల ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించగలదని అభిప్రాయపడ్డారు.