హైడ్రా తో పేదలు బతుకులు చిద్రం
కేంద్ర ప్రభుత్వం స్పందించి హైడ్రా ను ఆపాలి.
సూర్యాపేట జిల్లా రియల్ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్..
(సూర్యాపేట టౌన్ సెప్టెంబర్27 )
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాతో నివాస గృహాలు కూల్చివేతకు గురైన పేదల బతుకులు చిద్రమవుతున్నాయని వెంటనే హైడ్రాను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ లో అధికారులు ఇళ్లను మార్కింగ్ చేయడానికి వస్తే స్థానిక ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు కోల్పోవడంతో ఎంతోమంది నిరుపేదలు ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రజల కన్నీటికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రమాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా తో ఎంతోమంది తమ నివాసాలను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నారని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో హైడ్రా కొనసాగితే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఇళ్లను కూల్చితే పేదల ఆత్మహత్యలతోపాటు పేదల తిరుగుబాటు కూడా ప్రభుత్వం చవిచూడక తప్పదని హెచ్చరించారు. బడా నాయకుల ఆస్తులను కాపాడుతున్న రేవంత్ రెడ్డి పేదల ఇండ్లను కూల్చడం విడ్డూరంగా ఉందన్నారు. హైడ్రా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో హైడ్రా పేరుతో నిరుపేదల, ప్రజలపై జరుగుతున్న దాడులపై రాష్ట్ర ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకొని ప్రజలను కాపాడడంతోపాటు హైడ్రాను ఆపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సహోదరుడు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మం పాటీ అంజయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు పట్టేటి కిరణ్ షాప్ వెంకట్ రెడ్డి పట్టణ కార్యదర్శి అయిత గాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ ఎండి రషీద్ శేఖర్ నీలయ తదితరులు పాల్గొన్నారు….