ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 20
జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ తో కలసి ప్రాజెక్ట్ ఏరియా పరిశీలనలో తోడ్పాటు:
మండల నాయకులతో కలసి సహాయక చర్యలు:
బాధితులకి అండగా ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకు వెళ్లి న్యాయం చేస్తాననీ హామీ :
అన్నదాన శిభిరం ఏర్పాటు చేసి స్వయంగా వడ్డీంచిన ఎమ్మెల్యే జారే :
రోడ్డు పునరుద్దరణ పనులు చేపించి ట్రాఫిక్ క్లియర్ చేపించిన ఎమ్మెల్యే :
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమాన్వయం తో ప్రమాదం తప్పించినందున అభినందనల వెల్లువ :
పేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రమేష్ బాబు చొరవ తో స్థానిక మరియు నారాయణపురం చుట్టు ప్రక్కల కాంగ్రెస్ నాయకుల సహకారం :
వరద సహాయక చెర్యల్లో నారాయపురం మరియు గుమ్మడవల్లి ప్రాజెక్ట్ నాయకుల సహకారం మరువలేనిది ఎమ్మెల్యే జారే :
ఎమ్మెల్యే జారే ఆదేశాల మేరకు నిర్వసితులకి దుప్పట్లు పంపిణి చేసినా నియోజకవర్గం నాయకులు జూపల్లి రమేష్ బాబు:
నష్టం అంచనా ను 1000 కోట్లు పైనే అని కలెక్టర్ కి మరియు ఎస్పీ కి వివరించిన జారే :
అశ్వారావుపేట,
అశ్వారావుపేట మండలం లో తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండటం తో పాటు వరద ఉదృతి కి పెద్ద వాగు ఆయకట్టు తెగడం తో ప్రాజెక్ట్ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో భయాందోళనలు ఆలముకున్నాయీ,ఎటు చుసిన పంట పొలాలు ఇసుక మీటలు వేసాయీ, కొన్ని జంతు జలాలు వరద ఉదృతికి కొట్టుకు పోయాయి, రహదారులు జల మయం అయ్యాయి, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలీని పరిస్థితి, ఓ ప్రక్క మంచి నీటి కొరత అటువంటి సమయం లో స్థానిక అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే స్థానికంగా అందుబాటులో ఉండి ఆగిపోయిన మరియు దెబ్బతిన్న రవణా వ్యవస్థ నీ పునరుద్దరణ , అదేవిధంగా తుఫాను ప్రభావానికి దెబ్బతిన్న కరెంటు స్తంభాలను విద్యుత్ శాఖ వారితో మాట్లాడే అప్పటికప్పుడు దెబ్బతిన్న కరెంటు స్తంభాలు స్థానంలో కొత్తవాటిని వేసి కరెంటు పునరుద్దరించుటకు తగిన ఏర్పాటు చేశారు, నిర్వాసితులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి స్వయంగా నిర్వసితులకి వడ్డించారు,నష్టం అంచనా 1000 కోట్ల పైనే ఉండటం తో ప్రభుత్వంతో మాట్లాడి నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు,శుక్రవారం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ కి మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కి మరియు జాయింట్ కలెక్టర్ కి, ఐటీడిఏ పి ఓ కి పూర్తి వివరాలు దగ్గరుండి వివరించి చూపించారు,ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం లో 7 గ్రామాలు, తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం లో 2గ్రామాలు తుఫాన్ ప్రభావానికి దెబ్బతినట్లు వివరించారు,అదేవిధంగా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తో ఎన్ డి ర్ ఫ్ దళలను సమన్వయపరుస్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఎన్ డి ఆర్ ఫ్ దళల సహకారంతో వరదలు చిక్కుకున్న ప్రజలను కాపాడడంతోపాటు సహకారం అందించుట వల్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి, అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి తగిన సలహాలు సూచనలు చేస్తూ ముందుండి నడిపించడంలో సఫలీకృతం అయ్యారు ఎమ్మెల్యే జారే దీనికి అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ బాబు సహకారంతో నారాయణపురం మరియు చుట్టుపక్కల గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకులు మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజల సహకారంతో వరద సహాయక కార్యక్రమాలను వేగంగా నిర్వర్తించారు.అదేవిదంగా అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు దుప్పట్లు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిర్వసితులకి పంపిణి చేశారుఈ కార్యక్రమలలో ఎమ్మెల్యే జారే తో పాటు అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ యువజన నాయకులు జూపల్లి ప్రమోద్ బాబు, అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ తుమ్మ రాంబాబు, నారాయణపురం డీసీసీబీ చైర్మన్ నిమ్మల పుల్లారావు,, నండ్రు రమేష్, అశ్వారావుపేట డీసీసీబీ చైర్మన్ చిన్నం శెట్టి సత్యనారాయణ, మిండా హరి బాబు,సూరపనేని ఫణి, ఆకుల శీను, పసుపులేటి నరి, నాగేంద్ర,నవీన్ మధుర,జక్కుల చిన్ని,తిరుపతి రెడ్డి,వివిధ గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల గ్రామస్తులు పాల్గొన్నారు.