అధిక వర్షాలపై కలెక్టర్ అప్రమత్తం
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 5
కామారెడ్డి పట్టణంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ముంపు సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సిహెచ్. రాజేందర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బందితో కలిసి జి ఆర్ కాలనీ పరిసరాలను పర్యటించారు. జి ఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద ప్రవహిస్తున్న నీటి ఉద్ధృతిని ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, గతంలో భారీ వర్షాల వలన జరిగిన నష్టాలను గుర్తుచేస్తూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పరిస్థితులు అదుపు తప్పే ముందు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.