హైదరాబాద్, అక్టోబర్ 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దసరా పండుగ సందర్భంగా అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మాజీ హర్యానా గవర్నర్, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్మన్ బండారు విజయలక్ష్మి హాజరై పాల్గొన్న వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అలయ్ బలయ్ ఉత్సవం ప్రతి సంవత్సరం సామాజిక సమైక్యతకు, సాంప్రదాయ విలువల పరిరక్షణకు ప్రతీకగా నిర్వహించబడుతుందని విజయలక్ష్మి గుర్తు చేశారు. దసరా పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచించడమే కాకుండా సమాజంలో ఐక్యత, స్నేహ సంబంధాలు పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాలు దసరా పండుగను సామాజిక ఐక్యతకు ప్రతీకగా భావించి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలయ్ బలయ్ వేదికలలో ప్రజలకు వర్గ, కుల, మత భేదాలను అధిగమించి పరస్పర మమకారాన్ని పెంపొందించే కార్యక్రమంగా నిలుస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ హీరో నాగార్జున, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, మంత్రులు కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామి, సినీ నటుడు బ్రహ్మానందం, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయ పడ్డారు. దసరా పండుగను సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటూ సమాజంలో ఐక్యత, సౌహార్దం నెలకొల్పేందుకు ఈ తరహా కార్యక్రమాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, కురుమ సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడు తూముకుంట అరుణ్ కుమార్, గుమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు పుష్ప నగేష్, కొమురవెల్లి మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, ఓయూ విద్యార్థి నాయకులు కొంగల పాండు, గట్టయ్య, అడ్వకేట్లు నర్రి స్వామి, వంశీ, సిద్దిపేట జిల్లా టీజేయూ అధ్యక్షుడు మరాఠీ కృష్ణ మూర్తి, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు గుడాల చంద్రశేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు.
అలయ్ బలయ్ – సాంప్రదాయం, స్నేహం, సమైక్యతను మమకారంతో కలుపుతున్న వేడుక
Oplus_131072