ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీని కోరిన మాజీ ఎంపీటీసీ
ప్రశ్న ఆయుధం 03 సెప్టెంబర్( బాన్సువాడ ప్రతినిధి)
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ ను హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా బాన్సువాడ మండలంలోని బొర్లం మాజీ ఎంపీటీసీ పట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డిలు కలిశారు.ఈ సందర్బంగా బోర్లం గ్రామంలోని స్వయంభు ఆది బసవేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆలయ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు.ఈ సందర్బంగా జహీరాబాద్ ఎంపి సానుకూలంగా స్పందించి ఆలయ అభివృద్ధికి అన్నివేళలా సహకరిస్తానని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామంలో కృషి చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ యువ నాయకులు కాదిరెడ్డి సాయికిరణ్,రంజిత్ కుమార్ సయ్యద్ తదితరులు ఉన్నారు.