Site icon PRASHNA AYUDHAM

ఇవీఎంల భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

IMG 20251007 WA0019

ఇవీఎంల భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఎలక్షన్ గోడౌన్‌ వద్ద రక్షణ చర్యలను సమీక్ష

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 7

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎలక్షన్ గోడౌన్‌ను సందర్శించారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్‌తో కలిసి ఇవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఇవీఎం గోడౌన్‌ను పరిశీలించాం. రక్షణ చర్యలు సక్రమంగా అమలులో ఉన్నాయా అనే విషయాన్ని సమీక్షించాం” అని తెలిపారు. సీసీ కెమెరాలు 24 గంటలూ పని చేసేలా నిర్ధారించాలని, ఇసిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరంతర బందోబస్తు ఉండేలా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, ఎలక్షన్ డీటీ తదితర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version