ఎన్టీఆర్ నగర్‌లో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 01: కూకట్‌పల్లి ప్రతినిధి
ఎన్టీఆర్ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక భక్తులు ఈ వేడుకలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందించడంలో ఎంతో కీలకమని అన్నారు. యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.