ఏడవ రోజు లక్ష్మీదేవి అవతారంలో భక్తులను దర్శనమిచ్చిన శ్రీ రేణుకా మాత
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ సెప్టెంబర్ 28:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లో గల శ్రీ రేణుకా మాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం సందర్భంగా ఆలయంలో భక్తులు భారీగా తరలివచ్చి కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌడ మహిళలు పల్లకీ వేషధారణలతో బతుకమ్మ ఆడి, అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోగా, శోభాయాత్రలు, పాటలు, డప్పు వాయిద్యాలతో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.
ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపి గౌడ్, ఉపాధ్యక్షుడు రెడ్డిపేట వెంకట్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అబ్బగోని రమేష్ గౌడ్, సహాయ కార్యదర్శి తులసిరామ్ గౌడ్, కోశాధికారి బొంపల్లి ప్రవీణ్ గౌడ్, సభ్యులు సాయి చరణ్ గౌడ్, బొంపల్లి మహేష్ గౌడ్, కళాలి ప్రవీణ్ గౌడ్, పెరుమండ్ల అనిల్ గౌడ్, మోతే చింటూ, రెడ్డిపేట రామచందర్ గౌడ్ తదితరులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు.