ఐవిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ రక్తదాతలకు పురస్కారాల అందజేత రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ లచే పురస్కారాల అందజేత

ప్రశ్న ఆయుధం న్యూస్, జూలై 20, కామారెడ్డి :

హైదరాబాదులోని ముషీరాబాద్ లో గల వైశ్యభవన్ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో 73 మంది రక్తదాతలకు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ రక్తదాతల పురస్కారాలు 2024 ను శనివారం రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఐవిఎఫ్ సెంట్రల్ కమిటీ బోర్డు అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా ల ఆధ్వర్యంలో ప్రశంస పత్రం, మెమొంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు మాట్లాడుతూ.. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానంలో సేవలు చేస్తున్న వారందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఐవిఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో సంవత్సర కాలంలో తలసేమియా చిన్నారుల కోసం 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నమోదు కావడానికి కృషి చేసిన డాక్టర్ బాలు, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రక్తదాన శిబిరాలను ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో కామారెడ్డి కామారెడ్డి రక్తదాతల సమూహ సన్మాన గ్రహీతలు డాక్టర్ పుట్ల అనిల్, జమీల్, హైమద్ గంప ప్రసాద్, ఎర్రం చంద్రశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, కొడకల గోవర్ధన్, కిరణ్, సాయి, రమణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now