“ఒక కారులో దాగిన నీతి”..కే ఆర్
కపిలవాయి రవీందర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్
దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా,
సాధారణ మనిషిలా జీవించిన లాల్ బహదూర్ శాస్త్రి.
ఆయనకు ఒక ఫియట్ కారు కావాలి అనిపించింది.
ధర మాత్రం పన్నెండువేలు (₹12,000).
తన దగ్గర ఉన్నది కేవలం ఏడువేలు (₹7,000) మాత్రమే.
మిగతా ఐదువేలు (₹5,000) అప్పు తీసుకుని కారు కొనుగోలు చేశారు.
దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి,
ప్రభుత్వ ఖజానా తలుపులు తెరవలేరా?
చాలామంది అలా అనుకున్నారు.
కానీ శాస్త్రి అలాంటి ఆలోచన ఒక్క క్షణం కూడా చేయలేదు.
తన కష్టపడి సంపాదించిన దానితోనే కొనాలనుకున్నారు.
అయితే, ఆ కారు కొనుగోలు చేసిన ఏడాదికే
శాస్త్రి మరణించారు.
లోన్ ఇంకా పూర్తిగా తీర్చలేదు.
ఆ సమయంలో ప్రధాని అయిన ఇందిరా గాంధీ,
శాస్త్రి భార్యకు చెప్పింది –
“ఈ లోన్ మాఫీ చేస్తాం. మీరు చెల్లించనవసరం లేదు.”
అప్పుడేమైంది తెలుసా?
శాస్త్రి భార్య దృఢంగా చెప్పారు –
“అది నా భర్త నిజాయితీకి అవమానం.
ఆయన కష్టం మీద, నా పెన్షన్ డబ్బుతోనే
ఈ అప్పు తీర్చుతాను.”
అలా, ఒక్క పైసా మాఫీ చేయించుకోకుండా
క్రమంగా మొత్తం అప్పు తీర్చేశారు.
నిజాయితీ అంటే పదవితో రాదు, మనసుతో వస్తుంది.
అప్పు తీసుకున్నప్పుడు అది తిరిగి ఇవ్వడం నీతి.
దేశాన్ని నడిపినవాళ్లు కూడా సాధారణ మనుషుల్లాగే జీవించారని
శాస్త్రి జీవితం నిరూపించింది.
అలాంటి నాయకులు ఏ పార్టీకి చెందినవారైనా,
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.