Site icon PRASHNA AYUDHAM

కత్తిపోట్లు కాదు.. గాజుముక్కలతో గొడవ

IMG 20251004 WA0017

కత్తిపోట్లు కాదు.. గాజుముక్కలతో గొడవ

పాత కక్షలే కారణం—ఏఎస్పీ చైతన్య రెడ్డి; సిద్దార్థ్ అరెస్ట్, నలుగురికి గాయం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 04

 

విజయదశమి రోజు మధ్యరాత్రి కామారెడ్డి పట్టణంలో సంభవించిన ఘర్షణపై మొదట సోషల్‌ మీడియాలో కత్తిపోట్లు జరిగినట్లు ప్రచారం అయినా, పరిశీలనలో అది కత్తులుకాదు గాజు ముక్కలతో జరిగినదని జిల్లా ఏస్పీ చైతన్య రెడ్డి శనివారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు — సంఘటనకు పాత వ్యక్తిగత కక్షలే కారణమని నిర్ధారితమైందని, వెంటనే విచారణ ముమ్మరం చేయగా ఒక నిందితుడు సిద్దార్థ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.విజయదశమి అర్ధరాత్రి పోలీసులకు ‘100’ కాల్ రావడంతో సిబ్బంది అక్కడికి చేరగా రెండు గ్రూపుల మధ్య కొట్టుకుంటున్న దృశ్యం కనిపించిందని చెబుతున్నారు. విచారణలో గాజు ముక్కలతో దాడి జరిగినట్లు తేలినది—కేతన్, ప్రఫుల్ సహా నలుగురు యువకులకు గాయాలు కాగా, గాయాల తీవ్రతకు అనుగుణంగా చర్య తీసుకుంటున్నామని ఏస్పీ తెలిపారు. సంఘటనపై కామారెడ్డి పట్టణ సీఐ నరహరి, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొని విచారణ కొనసాగిస్తున్నారు. ఏఎస్పీ ప్రత్యేకంగా అన్నారు: చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరినైనా వదలమన్నది జరగరాదు; ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Exit mobile version