కన్కల్‌ గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా

కన్కల్‌ గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 2

 

 

తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో

శతాబ్ది వేడుకలు అఖండ ఉత్సాహంతో ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యానికి ముందే స్థాపించబడి, సమాజంలో క్రమశిక్షణ, సేవ, దేశభక్తి బీజాలు నాటిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆర్‌.ఎస్‌.ఎస్‌) నేటితో వందేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా, అనేక సాంస్కృతిక, సేవా, ఆలోచనాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

గ్రామంలో ఉదయం శతాబ్ది ర్యాలీతో ప్రారంభమైన వేడుకల్లో వందలాది మంది స్వయంసేవకులు గణవేషధారణలో, క్రమశిక్షణతో అడుగులు వేస్తూ దేశభక్తి నినాదాలతో ఆకట్టుకున్నారు. తర్వాత సాంస్కృతిక ప్రదర్శనలు, వీణ, వాయులీన వాద్య వాదనలు, యోగా, వ్యాయామ కైప్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.

 

ఈ సందర్భంగా ప్రముఖ ఆలోచనకర్తలు, మేధావులు, సంఘ సేవకులు ప్రసంగిస్తూ – “ఆర్‌.ఎస్‌.ఎస్‌ గత వందేళ్లుగా దేశానికి సేవ చేస్తున్న మహోన్నత సంస్థ. కేవలం ఆధ్యాత్మికం కాదు, సామాజిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లోనూ సేవలందిస్తోంది. శతాబ్ద ప్రస్థానం తర్వాత కూడా సమాజాన్ని సుస్థిరత, ఏకత, శక్తివంతమైన భారత నిర్మాణం దిశగా నడిపించనుంది” అని పేర్కొన్నారు.

 

వందలాది మంది ప్రజలు, భక్తులు, సేవకులు, ఈ వేడుకలకు హాజరై జై జవాన్, జై కిసాన్, జై జై మాత, భారత్ మాత, అంటూ నినాదాలతో, శతాబ్దోత్సవాలను విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now