స్వప్నలోక్ లో ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య
Headlines
  1. కామారెడ్డి: స్వప్నలోక్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
  2. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉచిత ఆరోగ్య పరీక్షలు
  3. స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
  4. అవసరమైన వారికి ఉచిత మందులు అందజేసిన మ్యాక్స్ కేర్ ఐ హాస్పిటల్, లయన్స్ క్లబ్
  5. అయుష్ వైద్య అధికారులతో ఆరోగ్య పరీక్షలు: కాలనీవాసుల కోసం ఉచిత వైద్య సేవలు
దిశ, కామారెడ్డి టౌన్ :

కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని స్వప్నలోక్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ హెల్త్ చెకప్ క్యాంప్ లో షుగర్, బీపీ, రక్త పరీక్షలు & కళ్ళకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మ్యాక్స్ కేర్ ఐ హాస్పిటల్, లయన్స్ క్లబ్ వారు మెడిసిన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ పల్స హరీష్ గౌడ్, డాక్టర్ దివ్యభారతి, ఆప్తమాలజిస్ట్ లింబాద్రి, ల్యాబ్ టెక్నీషియన్ వినయ్ లు, స్వప్నలోక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొడకల గోవర్ధన్, ఉపాధ్యక్షుడు పసులాది రాజు, కార్యదర్శి మాలావత్ దశరథ్, కోశాధికారి వజిర్ మారుతి రావు, నీలం రమేష్, పడిగెల రాములు, రామ శంకర్, ప్రశాంత్, బండారి సంజీవరెడ్డి, కొవ్వూరి వెంకటేశ్వర శర్మ కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now