⚫ కామారెడ్డి చరిత్రలో కొత్త అధ్యాయం — కలెక్టర్ ఆధ్వర్యంలో బాలికల ఐస్రో పర్యటన
⚫ జిల్లా నలుమూలల నుంచి 248 మంది విద్యార్థినుల పాల్గొనిక
⚫ సైన్స్ క్విజ్ కాంపిటీషన్‌కు విశేష స్పందన
⚫ భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
⚫ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్ఫూర్తిదాయక నిర్ణయం
ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబర్ 8:
కామారెడ్డి జిల్లా చరిత్రలో తొలిసారి ఒక వినూత్న విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్. పదవ తరగతి చదువుతున్న 30 మంది బాలికలను ఇస్రో పర్యటనకు ప్రభుత్వ ఖర్చులతో తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించారు.
ఈ సందర్భంగా వశిష్ట డిగ్రీ కాలేజ్, విద్యానగర్ కాలనీలో “స్పేస్ సైన్స్ క్విజ్ కాంపిటీషన్” ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి వచ్చిన 248 మంది విద్యార్థినులు పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
విజేతలుగా నిలిచిన 30 మంది బాలికలకు ఐస్రో పర్యటన అవకాశం కల్పించబడనుంది. ఈ సందర్శన ద్వారా విద్యార్థినులు ఉపగ్రహాల నిర్మాణం, ప్రయోగ ప్రక్రియ, అంతరిక్ష పరిశోధన పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ప్రేరణ పొందుతారని అధికారులు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యా రంగంలో కొత్త దిశగా అడుగుపెట్టినట్టుగా భావిస్తున్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని, భవిష్యత్తులో మరిన్ని నవ్య కార్యక్రమాలు చేపడతామని డిఎస్‌ఓ కామారెడ్డి తెలిపారు.
“అంతరిక్షం దూరం కాదు — ప్రతిభ, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు కాదు” అని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు.