కామారెడ్డి పాత బస్టాండ్ ఆవరణలో పోలీస్ అవగాహన
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా అక్టోబర్ 02
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ అప్ పోలీస్ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామరెడ్డి పాత బస్టాండ్ ఆవరణలో శుక్రవారం రోజున ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దొంగతనాలు సైబర్ నేరాలు మారకద్రవ్యాలు రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యo కలిగించారు. ఈ సందర్భంగా సైబర్ నేరలపై టోల్ ఫ్రీ నెంబర్ 1930, డయల్ 100 ద్వారా సమాచారం అందించవచ్చని అన్నారు. జిల్లా షీ టీమ్స్ WPCs సౌజన్య, ప్రవీణ మహిళలపై జరిగే నేరాల నివారణకు షీ టీమ్స్ నంబరు 8712686094 ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నపిల్లల పై జరిగే హత్యలను, లైంగిక నేరాలపై అవగాహన కల్పించి, నేటి యువత సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే అనర్ధాలను ఎలా నివారించాలో ప్రజలకు వివరించారు. సమాజంలోని యువత మాదకద్రవ్యా లు, గంజాయి, డ్రగ్స్ వాడటం వల్ల వారి జీవితాలు ఏ విధంగా నాశనమవుతున్నాయో వాళ్లకి అర్థమయ్యేలా పాటలు మాటల రూపంలో అర్థమయ్యేలా వివరించి వారు తీసుకున్న చర్యలు చేపట్టారో తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు PCs, ప్రభాకర్,సాయిలు పాల్గొన్నారు.