కామారెడ్డి హరిత కాలనీలో సద్ది బతుకమ్మ సంబరాలు

కామారెడ్డి హరిత కాలనీలో సద్ది బతుకమ్మ సంబరాలు

పాటల పోటీలు, బహుమతులతో మహిళల సందడి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 29 

 

కామారెడ్డి జిల్లా హరిత కాలనీలో సద్ది బతుకమ్మ వేడుకలు మహిళల ఉత్సాహంతో ఘనంగా జరిగాయి. సంస్కార భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు రంగురంగుల బతుకమ్మలతో కళకళలాడించారు. సాంప్రదాయ గీతాలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఆరాధించారు. ప్రత్యేక ఆకర్షణగా పాటల పోటీలు నిర్వహించగా 10 మంది మహిళలు పాల్గొన్నారు. పోటీలలో జి.ఇందిర ప్రథమ, ఎల్.భాగ్య ద్వితీయ, ఎం.సంజీవమ్మ తృతీయ బహుమతులు పొందారు. మహిళలకు బహుమతులు అందజేస్తూ నిర్వాహకులు సాంస్కృతిక సంప్రదాయాల ప్రాధాన్యతను వివరించారు. హరిత కాలనీ అంతా పూల సువాసనలతో పండుగ వాతావరణం నెలకొంది.

Join WhatsApp

Join Now