Site icon PRASHNA AYUDHAM

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం.

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 04

 

 

కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని శనివారం కామారెడ్డి మండల పరిధిలోని టేక్రియాల్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ రైతులకు విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ బోర్లకు కెపాసిటర్లను తప్పనిసరిగా అమర్చుకోవాలని, ఎలాంటి విద్యుత్ మరమ్మత్తులకైనా సొంతంగా ప్రయత్నించకుండా విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు. 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కు కాల్ చేసి విద్యుత్ సంబంధిత సేవలు ప్రజలందరూ పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో

డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్) ఎం. నాగరాజు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కిరణ్ చైతన్య, టేక్రియాల్ మాజీ కౌన్సిలర్ శంకర్ రావు , రైతులు పాల్గొన్నారు.

Exit mobile version