Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి లేబర్ అడ్డ వద్ద పోలీస్ అవగాహన కార్యక్రమం.

Screenshot 20250930 191013 1

కామారెడ్డి లేబర్ అడ్డ వద్ద పోలీస్ అవగాహన కార్యక్రమం.

 

కామారెడ్డి, సెప్టెంబరు 30 ( ప్రశ్న ఆయుధం):

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి లేబర్ అడ్డ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దొంగతనాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల మత్తు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం కలిగించారు.

 

ఈ సందర్భంగా షీ టీమ్స్ సభ్యులు PC భూమయ్య సైబర్ నేరాల గురించి వివరిస్తూ, బాధితులు టోల్ ఫ్రీ నంబరు 1930 లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు. మహిళలపై జరిగే నేరాల నివారణకు షీ టీమ్స్ నంబరు 87126 86094 ఉపయోగపడుతుందని అన్నారు.

 

బరొసా టీమ్ మహిళలు, చిన్నపిల్లలపై జరిగే హత్యలు, లైంగిక నేరాలపై అవగాహన కల్పించగా, యువతకు సోషల్ మీడియా వాడకంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవింగ్ వంటి ప్రమాదకరమైన అలవాట్లను నివారించాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌ఛార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, యు. శేషారావు, PCs ప్రభాకర్, సాయిలు పాల్గొని పాటలతో, మాటలతో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరణ ఇచ్చారు.

Exit mobile version