ఘనంగా మాజీ కేంద్రమంత్రి పుంజాల శివశంకర్ జన్మదిన వేడుకలు
జమ్మికుంట ఆగస్టు 10 ప్రశ్న ఆయుధం
కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ పుంజాల శివశంకర్ జన్మదిన వేడుకలను మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జమ్మికుంటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగల్ విండో అధ్యక్షుడు పొనగంటి సంపత్, సంఘం పట్టణ మండల అధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్, తోట లక్ష్మణ్, నాయకులు ఆకుల రాజేందర్, సాయిని రవి లు మాట్లాడుతూ పుంజాల శివశంకర్ కేంద్ర మంత్రిగా ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడని సుమారు 90 కులాలను బీసీల్లో కలపడంలో ప్రముఖ పాత్ర వహించాడని మున్నూరు కాపు కుల ఐక్యత కొరకు ఎంతో పాటు పడ్డారని వారు తెలిపారు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం వీణవంక ఇల్లందకుంట మండల అధ్యక్షులు పురం శెట్టి చేరాలు, రమేష్ నాయకులు
పొనగంటి సారంగం, పొన్నగంటి మల్లయ్య కాంట్రాక్టర్, ఆకుల రాజయ్య, కడెం జనార్ధన్, కొల కానీ రాజు, కాసర్ల రాములు, పొన్నగంటి రవికుమార్ పిజేఆర్, పొ నగంటి రవీందర్, పొనగంటి కొమరయ్య, ఊడుగుల మహేందర్ ,నీరటి సతీష్, ఆకుల పోచయ్య,ఏ బూషి ఓదెలు, జెమిని సురేష్ ,కడెం సతీష్, శెట్టి ఉదయ భాస్కర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.