ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కామారెడ్డిలో రంగురంగుల వేడుకలు – మహిళల సందడి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

 ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 29

 

కామారెడ్డి పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ హైస్కూల్లో జరిగిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులు సందడి చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా బతుకమ్మ ఆడగా, మహిళలు కోలాటాలు ఆడుతూ ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఇర్షాద్, సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, పారిశ్రామికవేత్త పైడి సంతోష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ సభ్యులు, పట్టణ మహిళలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now