జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త డీఆర్వో
జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్. మధుమోహన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 6
జిల్లా రెవెన్యూ అధికారిగా నూతనంగా నియమితులైన సిహెచ్. మధుమోహన్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్‌తో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకెను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొత్త డీఆర్వోకు శుభాకాంక్షలు తెలుపుతూ, రెవెన్యూ శాఖ పనితీరు మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.