జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో తాగునీటి కష్టాలు .

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో తాగునీటి కష్టాలు

 

పండుగ పూట త్రాగునీటికై ఇబ్బందుల్లో ప్రయాణికులు

 

కామారెడ్డి, సెప్టెంబరు 30 ( ప్రశ్న ఆయుధం ): కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో ఏర్పాటుచేసిన తాగునీటి కొళాయిల్లోకి నీరు రావడంలేదు. పండక్కి వెళ్లేందుకు బస్టాండ్‌కి చేరుకున్న ప్రయాణికులు తాగేందుకు నీటి కోసం చూస్తే అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాసేపటి నుంచి నీళ్లు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌ను సందర్శించే వారు ఎక్కువగా పండగకాలంలో వచ్చే సమయంలో కనీస వసతులు లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని,ఎన్నిసార్లు ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు త్రాగునీటి అందించడానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now