Site icon PRASHNA AYUDHAM

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సూచన

IMG 20250922 WA0025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ సూచన

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 5

 

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఇటీవల అధిక వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, ఓవర్‌ఫ్లో అయ్యే చెరువులు, ప్రాజెక్టులు, ప్రమాదకర వాగులు, పాత భవనాలు, విద్యుత్ స్తంభాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ప్రభుత్వ సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే కలెక్టరేట్ టోల్‌ఫ్రీ నంబర్‌ 08468-220069కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Exit mobile version