Site icon PRASHNA AYUDHAM

జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

IMG 20250930 211740

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు అనగా అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు. అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

Exit mobile version