టిజీపీఎస్సీ గ్రూప్-1లో రవితేజ విజయం
కామారెడ్డి శిక్షణ డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు
కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 29
టిజీపీఎస్సీ గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన రవితేజ కామారెడ్డి జిల్లాలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఆయన కలెక్టరేట్ చేరుకుని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రవితేజ కలెక్టర్కు పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.