తాడ్వాయిలో బీజేపీ కార్యకర్తల సమావేశం – ఐకమత్యంతో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 5
తాడ్వాయి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆకుల భరత్, హాజరై, కార్యకర్తలతో ఉత్సాహవంతమైన మాటలతో ప్రేరణ నింపారు. “పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే ప్రతి కార్యకర్త కూడా ఒక అభ్యర్థిగా భావించి కష్టపడాలి. ఐకమత్యమే విజయానికి మూలాధారం” అని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాపు రెడ్డి, జిల్లా కార్యదర్శి హోటల్ శ్రీను, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట్రావు, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు, బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు చైతన్య గౌడ్, మండల ఉపాధ్యక్షులు బాలాజీ, రాజీ రెడ్డి, ధర్మపురి, సీనియర్ నాయకులు నర్సారెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు దత్తాత్రేయ, దళిత మోర్చా మండల అధ్యక్షుడు బత్తుల స్వామి, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయపతాక0 ఎగురవేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.