Site icon PRASHNA AYUDHAM

తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ నగరం❓

తెలంగాణకు
Headlines in Telugu:
  1. తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్: మాస్టర్ ప్లాన్ ఆమోదం, భూసేకరణలో ముందడుగు
  2. వరంగల్ రెండో రాజధాని దిశగా వేగంగా అడుగులు: 2041 మాస్టర్ ప్లాన్, మామునూరు విమానాశ్రయ అభివృద్ధి
  3. రాష్ట్ర ప్రభుత్వ ముహూర్తంతో వరంగల్‌లో అభివృద్ధి: 2041 మాస్టర్ ప్లాన్ ఆమోదం, 205 కోట్లు విడుదల
  4. వరంగల్‌ను రెండో రాజధాని గా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు

హైదరాబాద్:నవంబర్ 20

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే కోటి జనాభా దాటింది. నగరం వేగంగా విస్తరిస్తుం డటంతో పాటుగా జనాభా పెరుగుదలో గణనీయమైన వృద్ధిని సాధించింది. తెలం గాణకు రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ప్రతిపాదన ఉంది.

రెండో రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరంగల్ నగరం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా వరంగల్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఏర్పాటు చేసేం దుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు సంబంధించి ప్రభుత్వ పరంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కుడా 2041 మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం లభించింది. మామునూరు విమానా శ్రయానికి అవసరమైన అదనపు భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 

బృహత్‌ ప్రణాళికకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ జీవో జారీ చేశారు. దీనిపై నిన్న జరిగిన వరంగల్ సభ లో సీఎం కూడా ప్రస్థావించారు దీని కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసారు… వరంగల్, కాజీపేట, హనుమకొండ, అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాలలో కలిపి మొత్తం 1,805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్‌ ప్లాన్‌ పరిధిగా నిర్ణయిం చారు. 

ఇందులో భాగంగా భూవిని యోగ జోన్లను గుర్తించారు. దీంతో ‘కుడా’ పరిధిలో భవననిర్మాణాలకు అడ్డం కులు తొలగనున్నాయి. ప్రాంతీయ, బాహ్యవలయ, అంతర్‌ వలయ, అనుసం ధాన రోడ్ల నిర్మాణాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. 

చెరువులు, నాలాల పునరుద్ధరణ పనులు వేగవంతం కానున్నాయి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు కు మార్గం సుగమం కానుంది. 2018లోనే మాస్టర్ ప్లాన్ వాస్తవానికి డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన్‌ గుర్తింపునకు తొలుత 2018లోనే నోటిఫికేషన్‌ జారీచేశారు. 

ఆయా జిల్లాల కలెక్టర్లు, కుడా ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ఇతర అధికారులు సమీక్షలు నిర్వహించిన అనంతరం ప్రతిపాదనలు రూపొందించి 2020లో ప్రభుత్వ ఆమోదానికి పంపారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. 

వాటిని అధిగమించేందుకు పలు విడతలుగా సమావే శాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. వరంగల్‌లోని మాము నూరు విమానాశ్రయ అభివృద్ధికి చేపట్టనున్న పనులలో మరో ముందడుగు పడింది. విమానాశ్రయానికి అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేక రణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Exit mobile version