కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతే రాజు

కాంగ్రెస్
Headlines
  1. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి: జువ్వాడి కృష్ణారావు
  2. కాంగ్రెస్ హయంలోనే ఏకకాలంలో రుణమాఫీ: జువ్వాడి కృష్ణారావు
  3. రైతు పండగ సందర్భంగా కోరుట్ల కాంగ్రెస్ కార్యక్రమం ఘనంగా
  4. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేసారా? కాంగ్రెస్ నేత ప్రశ్న
కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు 

 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పెద్దపీట వేసిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న రైతు పండగ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని ఐలాపూర్ రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. దేశంలో ఎక్కడా కూడా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి రుణమాఫీ చేశారా అని నిలదీశారు. బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తంలో వేలాది కోట్ల రుణాలు మాఫీ చేస్తుందని, కానీ రైతులను పట్టించుకోదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం రైతులు పేదల పక్షపాతి అని జవ్వాడి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగమణితో పాటు ఏఈఓలు శ్రీహరి, సమీనా యాస్మిన్, నరేష్, రాఘవేంద్ర, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ పుల్లూరి వెంకటేష్ గౌడ్, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు నక్క సుధీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లూ బాపురెడ్డి, అమరేందర్, పల్లపు రాజు, జక్కుల రాజం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్ది, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఏలేటి శసిందర్ రెడ్ది, సాయి రెడ్ది, కరిపెల్లి అజయ్ రెడ్డి, ముక్కెర రాజేష్, గడ్డం హన్మక్క, పన్నాల లింగారెడ్డి, ఏలేటి జలపతి రెడ్ది, సుమన్ మరుపాక, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, కొత్తపల్లి రంజిత్ రెడ్ది, కుర్మా తిరుపతి, నేమూరి భూమయ్య, కల్లూరు రసూల్, లింబాద్రి నరేష్, జనార్దన్, తెడ్డు విజయ్, పెండెం రమేష్, ముహమ్మద్ నసీర్, మ్యాదరి లక్ష్మణ్, సైదు గంగాధర్, స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment