ప్రశ్న ఆయుధం 20జులై
హైదరాబాద్ :
తెలంగాణ, చతిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులో మావో యిస్టు,పోలీసులకు మధ్య ఈరోజు ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి.పోలీసుల ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా తెలిసింది దీంతో సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎదురుకాల్పులకు సంబం ధించిన వివరాలు ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ వెల్లడించారు
చత్తిస్ ఘఢ్ తెలంగాణలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు శనివారం ఉదయం 07.00 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా..
ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజా పూర్ జిల్లా ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీమల దొడ్డి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరవ సారి గుట్ట సమీపంలో దాదాపు 20 మంది నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) తీవ్రవాదులు ఆలివ్ గ్రీన్ యూనిఫారం తుపాకులను ధరించి పోలీసులపై కాల్పులు జరిపడం ప్రారంభించారుపోలీసులపై విచక్షణా రహి తంగా కాల్పులు జరుపు తూనే ఉండగా కాల్పులు ఆపాలని, ఆయుధాలు వదిలి లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, సీపీఐ మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే ఉండగా ఆత్మరక్షణ కోసం మా పోలీస్ పార్టీ కూడా ఎదురు కాల్పులు జరిపారన్నారు.
ఈ ఎదురుకాల్పులు 15 నిమిషాలకు పైగా కొనసా గాయి, అవతలి వైపు నుండి కాల్పులు ఆగిపోగా ఆ ప్రాంతాన్ని తనిఖీ చేయ గా,తుపాకీ గాయాలతో చనిపోయిన మావోయిస్టు కనిపించాడని అన్నారు.సంఘటన స్థలం నుండి ఒక 9 ఎం ఎం కార్బైన్ తుపాకీ , తూటాలు మందుగుండు సామగ్రి, డిటోనేటర్, సిపిఐ మావోయిస్టు సాహిత్యం కిట్ బ్యాగులు, ఇతర రోజువారీ వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు..
తెలంగాణ సరిహద్దు లో మళ్లీ ఎదురు కాల్పులు
Published On: July 20, 2024 2:15 pm