దుర్గ మాత నిమజ్జనం ఘనంగా
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 3
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా దుర్గ మాత నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగడం, పట్టణంలో వివిధ మండపాల నుండి భక్తులు జాతరలా ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జన స్థలాలకు తరలించారు. డప్పుల వాయిద్యాలు, నృత్యాలతో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల కోలాహలం, జయజయధ్వానాలతో పట్టణం అంతా మార్మోగుతుంది. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు కల్పించి, ట్రాఫిక్ నియంత్రణతో నిమజ్జనం సజావుగా పూర్తయ్యేలా సహకరించి,ఎలాంటి అపరిశుభ్ర సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం శాంతియుత వాతావరణంలో విజయవంతంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న ఎస్పీ రాజేష్ చంద్ర, ఏ ఎస్పీ చైతన్య రెడ్డి,పట్టణ సిఐ నరహరి, మరియు పోలీస్ శాఖ బృందం.