నడి రోడ్డుపై నిప్పంటిచుకున్న వ్యక్తి
విశాఖలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి నిప్పంటిచుకున్నాడు.
ఈ ఘటన శుక్రవారం ఉదయం ఆరిలోవలో జరిగింది.
ఓ వ్యక్తి రోడ్డుపైకి వచ్చి అందరూ చూస్తుండగానే తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు, 108కి సమాచారం అందిచారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతడిని 108లో KGHకి తరలించారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం.