నర్సాపూర్, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నర్సాపూర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం అందించిన మహనీయుడు అని, ఆయన త్యాగాలు భారత చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, యువత ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, బిక్షపతి గౌడ్, అనిల్ గౌడ్, వీరాస్వామి గౌడ్, వెంకట్ గౌడ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి
Oplus_131072