మెదక్/నార్సింగి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని పల్లె దావఖానాను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దావఖానాలోని రికార్డులను సమీక్షించి, అక్కడి వైద్య సిబ్బందిని అడిగి మహిళలు, చిన్నారులకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పల్లె దావఖానాకు విచ్చేసిన మహిళలతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. అవసరమైతే మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తర్వాత ఒక చిన్నారిని ఎత్తుకొని ఆప్యాయతతో పలుకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ దాలే కృష్ణ మూర్తి, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి బాబు,నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నార్సింగిలో పల్లె దావఖానాను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
Oplus_131072